Friday, September 7, 2018

కధలో నిజం వుండాలి



కధలు నిజాన్ని చెప్పాలి . నిజమైన ప్రేమ అంటే ఇదేరా అని చెప్పే కధలు రావాలి .  నిజమైన  యుద్ధం అంటే ఇదేరా అని చెప్పే కధలు రావాలి . నిజమైన దేశ భక్తి కధ అంటే ఇదేరా అని చెప్పే కధలు రావాలి . ఇలా నిజమైన అనిపించే కధలు రావాలి అంటే ఆ  కధలో నిజం వుండాలి . వాస్తవిక పరిస్థులలో నిజంగా ఏం జరుగుతుందో అలానే కధలో కూడా ఆ నిజాన్నే చూపించాలి . అంటే  ఒక అంశము అనగా ప్రేమ కాని , యుద్ధం కాని, మరేదైనా కాని , అది నిజమైతే మనిషి ఎలా ప్రవర్తిస్థాడో ఆ ప్రవర్తనే నిజమైన కధ అవుతుంది .ఆ కధే నిజం చెపుతుంది . ఇలా నిజం చెప్పిన కధలన్నీ సూపర్ హిట్ అయినవె .
                       ఉదాహరణకి  ఇద్దరు ప్రేమికులు అనుకోని సందర్భంలో వాళ్ళిద్దరూ విడిపోయినా    అబ్బాయి మాత్రం వేరే అమ్మాయిని చూడకుండా వున్నాడు .అయితే అమ్మాయికి మరొకరితో పెళ్లి అయి  అనుకోని సందర్బంలో తన  భర్తతో విడిపోయి  అనాధలా జీవిస్తుంటే తిరిగి ఆ ప్రేమికుడు ఆ అమ్మాయిని ఆదరించి  తనకి ఒక కొత్త  జీవితం ఇస్తాడు . అంటే ఈ ప్రేమ కధలో ప్రేమికుడు ఆ ప్రేమికురాలిని మరిచిపోలేకపోవడంతో తిరిగి ఆ అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు . ఆ మరిచిపోలేకపోవడమే నిజమైన ప్రేమ .ఇలాంటి కధ చూసినపుడు ఇదిరా నిజమైన ప్రేమ అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది .
                            అదే విధంగా పౌరాణికం కధలోకి వెళితే ఒక రాజ్యంలో సైన్యాధ్యక్షుడిగా పని చేసే వ్యక్తి ఇచ్చిన మాటకోసం రాజాన్ని కాపాడటం కోసం కట్టుబడి ఉంటాడు . ఆ రాజ్యాన్ని కాపాడటం కోసం ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్దంగా ఉంటాడు . అనుకోకుండా ఒక రోజు ఒక యుద్ధం జరుగుతుంది  రాజుని రాజ్యాన్ని కాపాడటం కోసం యుద్దంలో తన నరాలు తెగిపడుతున్న లెక్క చేయక ఎదురు దాడి చేసే వందల మంది సైన్యాన్ని చంపి తన రాజుని రాజ్యాన్ని కాపాడుతాడు ఆ సైన్యాధ్యక్షుడు . యుద్ధం అయిపోయిన తరువాత ప్రాణం వదిలేస్తాడు . ఇలాంటి కధ చూసిన ప్రేక్షకునికి ఇదిరా నిజమైన యుద్ద కధ అంటే అని అనిపిస్తుంది .
                            ఇలా ఒక అంశము నిజమైతే నటులు ఎలా ప్రవర్తిస్థారో తెలిపే కధలే నిజాన్ని చెప్పే కధలు .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...