Friday, September 7, 2018

కధలో ఎమోషన్స్ వుండాలి


       

ఎమోషనల్ అనేది మానసిక భావోద్వేగానికి సంభందించినది .ఆ భావోద్వేగంలో కోపం ఉండవచ్చు ఆనందం ఉండొచ్చు ఆతృత ఉండచ్చు మరేదైనా ఫీలింగ్ ఉండవచ్చు .సినిమా కధలో రకరకాల ఎమోషన్స్ ఉండవచ్చు . అయితే ఇక్కడ సినిమా అనేది ఏం పని చేస్తుంది అంటే కధలో ఎమోషన్స్ ద్వారా తన సినీమా కధా ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆ ఎమోషన్స్ కి ప్రభావితం అయ్యేలా చేసి చివరికి ముగింపు దశలో ఆ ప్రేక్షకుడికి నచ్చేలా చేస్తుంది . అయితే కధలో ప్రేక్షకుడు ఎమోషనల్ గా ప్రభావితం కావాలంటే ప్రేక్షకుడు అన్ని మరచి కధలో పూర్తిగా కనెక్ట్ అయ్యేలా చేసుండాలి . కధలో ఎక్కడ  ఏ సీన్ చూపిస్తే  ప్రేక్షకులు ఎమోషనల్ కి ప్రభావితం అవుతారో లేదా కధలో ఎక్కడ ఎలా ఎమోషనల్ కి ప్రభావితం కావాలో అని నిర్ణయించి ఎమోషన్  సీన్లు పెట్టడం నిర్ణయించాలి .కాని ప్రతి ప్రేక్షకుడి సినిమా నుంచి ఏదో ఒక ఆనందం అన్న ఎమోషన్ దొరుకుతుంది అన్న ఆశతో వస్తారు . కావలసిన ఎమోషన్ దొరకకపోతే ఆ సినిమా ప్రేక్షకునికి నచ్చదు.కాబట్టి ఏ ఏ సీన్లు పెడితే ఎటువంటి ఎమోషన్స్ కలుగుతాయో రచయతకి తెలిసుండాలి .అయితే మనలో ఎమోషన్స్ లో ఆనందం కోపం భాధ భయం ఇంకా రక రకాల ఎమోషన్స్ వున్నాయి . అయితే ఏ సీన్ చూపిస్తే ప్రేక్షకునిలో ఎలాంటి ఎమోషన్ పుడుతుందో లేదా ప్రేక్షకునికి ఎలాంటి  ఎమోషన్ ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి  సీన్లు పెట్టాలి అని దర్శకునికి తెలిసుండాలి . ఉదాహరణకి  కామిడియన్ చేసే వింత పనులను మరియు అర్థం లేని మాటలు లేదా అమాయకత్వం లేదా విచిత్ర వేషదారణ లేదా పొరపాట్ల వలనో చేసే పనులు  చూసి ప్రేక్షకుడు నవ్వుకుంటాడు .అదే విధంగా ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమని జయించుకోవడానికి చాల కష్టాలు భాదలు పడుతుంటే అవి ప్రేక్షకులు చూసి అయ్యో పాపం అంటారు .   ఒక మంచి వ్యక్తి అయిన హీరోని దొంగలు కొడుతుంటే కొందరు పాపం అని అంటారు మరికొందరు హీరోని కొడుతున్నారు అని కోపడతారు . సినిమా తీయటానికి ఎంత కర్చు పెట్టినా ఎంత పుబ్లిసిటీ చేసినా ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా ఎమోషన్ కూడా అతి ప్రదానమైన విషయము .


No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...