Friday, September 7, 2018

కధలో కొత్తధనంలో స్పష్టత వుండాలి


                                    
గొప్ప గొప్ప దర్శకులు సైతం కొత్త కధని తీసుకొని విజయం సాధించలేకపోవడానికి గల కారణం కధని స్పష్టంగా ప్రేక్షకులకి  అర్థం అయ్యేలా చూపించలేకపోవడమే .ఇక్కడ చిన్న విషయమును గమనించాల్సి వుంది కొత్తదనంకి ప్రేక్షకులు అట్రాక్షన్ అవుతారు . కొత్తగా స్పష్టంగా ఏ  విషయం చెప్పినా శ్రద్దతో  ఆసక్తిగా వింటారు .ఆ కొత్తదనాన్ని స్పష్టంగా చూపించలేకపోతే ప్రేక్షకులు ఆ సినిమాని నిరాధరిస్తారు అన్న సత్యాన్ని సినిమా కధలో కొత్త ప్రయోగాలు చేసే దర్శకులు  గమనించాలి .కధలు చాల గొప్పగా వుంటాయి కానీ వాటిని చూపించే  విధానంలో స్పష్టత ఉండదు .కధని అదే పనిగా అర్థం చేసుకొనే పనిలో ఎవరూ వుండరు కాబట్టి కధ అనేది  సహజంగా అర్థమైయేలా వుండాలి .కధ అర్థమవటానికి ముందుగా కొన్ని జాగ్రత్తలతో కొన్ని సీన్లను జత చేసుకోవాలి .కాబట్టి కొత్తదనాన్ని  స్పష్టంగా చూపించడంలో సినిమా విజయం దాగుంది అని చెప్పవచ్చు .కధ పాతదే అయినా కధలో చేసే పాత్రలు సన్నివేశాలు  డైలాగులు  ఫైట్స్ సాంగ్స్ భాష విధానం కొత్తధనంగాను మరియు వాటి వెనుక వున్నా అంతరార్ధం ప్రేక్షకునికి అర్దమైయేలా స్పష్టంగా వుండాలి .
                                             ఎన్ని కోట్లు కర్చు పెట్టి సినిమా తీసినా , ఎంత ఎక్కువ మంది చేత పని చేయించినా , ఎంత గొప్ప నటులతో సినిమా తీసినా , ఎంత గొప్ప టెక్నాలజీ వాడినా , తీసే కధలో భలం లేకపోతే , కొత్తధనం లేకపోతే , ఆ కొత్తదనంలో స్పష్టత లేకపోతే, ఆ సినిమా విజయం సాదించటానికి అవకాశం తక్కువ అని  నా ఉద్దేశం .కధలో భలమైన ఆకర్షనమైన కొత్త పదాల వాడుక, కొత్త పాటలు పేర్లు ,కొత్తగా పలికే భాషా విధానం   మరెన్నో కొత్త విషయాలు సినిమాని  విజయంవైపు నడిపిస్తాయి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...