పిండి కొద్ది రొట్టెలు అన్న విధానంగా సినిమాలో
భలం వుంటే ఆ భలమే ప్రేక్షకుల చేత మాట్లాడుకునేల , ధియేటర్కి
రప్పించేలా చేస్తుంది . అయితే ఆ
భలమేమిటో తెలియచేసే విధానాన్నే పుబ్లిసిటీ అని పిలుస్తాము . ఈ పుబ్లిసిటీ అనేది
సినిమాకి ప్రేక్షకునికి మధ్య వారధిలా పనిచేస్తుంది . అయితే సినిమా రిలీజ్ ముందు
ఎటువంటి పుబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులని ధియేటర్కి రప్పించవచ్చు , సినిమా రిలీజ్
అయిన తరువాత ఎటువంటి పుబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులని ధియేటర్ రప్పించవచ్చు అనే
విషయాలు ఏమిటి అని చూసినట్లు అయితే !
సినిమా రిలీజ్ ముందు
ధియేటర్కి రప్పించటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి , ఆకర్షింపభడేలా చేసి , మొదటి
రెండు రోజులు ధియేటర్కి రప్పించినా కూడా , ఆ సినిమాకి సంభందించి గొప్ప
నటులు ఉన్నా, గొప్ప డైరెక్టర్ అయినా , పెద్ద బ్యానర్ అయినా , వెండితెర ముందర
ప్రేక్షకులు కూర్చున్నాక ఈ సినిమా
డైరెక్టర్ ఎవరు , హీరో గొప్ప నటుడే అనే అన్ని విషయాలు మరిచిపోతారు . కేవలం కధ మీదే
ద్రుష్టి నిలుపుతారు , వాళ్ళు కావాలనుకున్న ఎమోషన్స్ని లేదా మరో ఇతర ఆనందం కోసమే ఎదురు చూస్తారు .ఆ సినిమా చుసిన తరువాత సినిమా చాల భాగుంది అని నోటి ద్వారా చెప్పే మాటే
అన్నిటికన్నా గొప్ప పుబ్లిసిటీ . ఆ పుబ్లిసిటీ
మరో ప్రేక్షకుడిని ధియేటర్కి రప్పించేలా చేస్తుంది .
ఆటో లేదా రిక్షా మైక్
పాత కాలం నుంచి వస్తున్న ప్రచారం ఇది . రిక్షాకి
లేదా ఆటోకి సినిమా పోస్టర్ని అతికించి మైకులో సినిమాకి సంభందించిన సినిమా
విశేషాలను ప్రచారం చేస్తూ ప్రేక్షకులని ఆకర్షిస్తూ ప్రేక్షకులని ధియేటర్కి రప్పించేవాళ్ళు
.
రేడియో
కొత్తగా రిలీజ్ అయిన పాటలని , సినిమా రిలీజ్
అయినతరువాత సినిమా గురించి రేడియోలో ప్రచారం చేయడం కూడా సినిమా ధియేటర్
రప్పించడంలో రేడియో కూడా సహకరిస్తుంది .
న్యూస్ పేపర్
సినిమా మొదలు నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆ
సినిమా విజయమా లేక అపజయమా అనే విషయం వరకూ news పేపర్లో ప్రత్యేకంగా సినిమాకు
సంభందించిన ఒక పేజి వుంటుంది .ఆ పేజిలో సినిమాకి సంభందించిన అన్ని విశేషాలను
ప్రచురించడం జరుగుతుంది , సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది , ఆ సినిమా ఎన్నవ రోజు
ఆడుతుంది అనే విషయాలను కూడా ఆ సినిమా పేజిలో వుంతుంది . ఇలా సినిమా గురించి ప్రతి
విషయాన్ని తెలియజేస్తూ ప్రేక్షకులని సినిమా
ధియేటర్ ప్రేక్షకుడిని వెళ్ళేలా చేస్తుంది.
ఆర్టికల్స్
ఏదైనా
news పేపర్లోనూ లేదా magazine లోనూ లేదా websites లోనూ సినిమాకి సంభందించి రాయడం
వలన ప్రేక్షకునికి ఆ సినిమాఫై ప్రత్యెక ద్రుష్టి ఏర్పడి సినిమా చూడాలి అనే ఆలోచన
పుడుతుంది . ఆ ఆలోచనే , ఆకర్షణే ప్రేక్షకులని
ధియేటర్కి రప్పించేలా చేస్తుంది .
పోస్టర్స్
పోస్టర్ ద్వారా చేసే పుబ్లిసిటీ బయట తిరిగే సినిమా ప్రేక్షకులకోసం . సినిమా
రిలీజ్ date నిర్ణయం తీసుకోకుంటే comming
soon అని సినిమా పోస్టర్ని పుబ్లిసిటీ చేస్తారు .
తరువాత date నిర్ణయించిన తరువార రిలీజ్ date తో పాటు ధియేటర్ పేరును వేసి
పోస్టర్ని పుబ్లిసిటీ చేస్తారు . పోస్టర్ అనేది ఆకర్షనీయంగా ఉంటేనే ప్రేక్షకులు
కూడా ఆకర్షితులు అవుతారు .
ఫ్లెక్సి బోర్డులు
పెద్ద పెద్ద భవనాలపై మరియు ఊరికి భయట పెద్ద పెద్ద ఫ్లెక్సి బోర్డులలో సినిమా పోస్టర్స్ని చూస్తూ ఉంటాము . ఈ బోర్డులు
చాల ఆకర్షించేలా వుంటాయి , ఆ ఆకర్షణే
ప్రేక్షకులని మాట్లాడుకునేలా మరియు ధియేటర్ రప్పించేలా చేస్తాయి.
బస్సు పోస్టర్స్
బస్సుకి ఇరువైపులా సినిమా పోస్టర్లను అతికించి
పుబ్లిసిటీ చేయడం ద్వారా ఆ బస్సు తిరిగే అన్ని ఊర్లలో సినిమాని ప్రచారం చేయవచు
.
రైలు పోస్టర్లు
సిటీలో వుండే రైలుకి మరియు దూరం వెళ్ళే రైలుకి
సినిమా పెద్ద పోస్టర్లను చూస్తూ ఉంటాము . ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం వెళ్ళే
అన్ని ప్రదేశాలకు రైలు ద్వారా ప్రచారం చేయచ్చు . ఇలా ప్రచారం చేయడం వలన
ప్రేక్షకులని ధియేటర్కి రప్పించే విషయములో ఇదొకటి .
టెలివిషన్
tv లో
సినిమాకి సంభందించిన trailer ని , ప్రత్యేక విశేసాలని , టీవీ ఛానల్ వారు
వారి ప్రత్యెక ప్రసారాల ద్వారా ప్రజలకి తెలిసేలా చేస్తుంది . సినిమా ప్రేక్షకుల
కోసం ప్రత్యెక కార్యక్రమాలు పెట్టి సినిమా
తీయబోయే సినిమాలగురించి మరియు తీస్తున్న
సినిమాల గురించి తెలియచేయడంలో సహకరిస్తున్నాయి . మరియు ఒక సినిమా రిలీజ్ అయిన
తరువాత నటులని దర్శకుడిని పిలిపించి ఆ
సినిమా సంభందించిన విశేషాలను ,
ప్రత్యేకతలను ఆ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకి తెలిసేలా చేస్తుంది .
audio launch
పాటలని రిలీజ్ చేయడం కోసం audio launch అనే ఫంక్షన్ని పెట్టి ఆ సినిమాని
పుబ్లిసిటీ చేయడంలో ఒక పద్దతి .
ఈ audio launch ఫంక్షన్ని tv ఛానల్లో
ప్రత్యేక్ష ప్రసారం చేయడం . news పేపర్లో
వేయించడం , మరియి సోషల్ మీడియాలో పోస్ట్
చేయడం లాంటివి చేస్తారు . అయితే
ప్రత్యేక్ష ప్రసారం చూడలేనివాళ్ళు news పేపర్లో చూడచ్చు . news పేపర్లో
చూడలేని వాళ్ళు సోషల్ మీడియాలో చూడచ్చు . సోషల్ మీడియాలో కూడా చూడలేని వాళ్ళు
ఎక్కడన్నా ఆటోలోనో , లేదా fm రేడియో లోనో వినడం ద్వారా తెలుస్తుంది . సాంగ్స్ అద్బుతంగా వున్నట్లు అయితే రేడియో లో , ఆటోలలో , చిన్నపిల్లల నోటిలో అవే
వినిపిస్తూ వుంటాయి . పాటలే ఇంత భాగుంటే
సినిమా ఎంత భాగుంటుందో అని ప్రేక్షకులని ఆలోచింపచేసేలా చేస్తాయి పాటలు . ఆ ఆలోచనే
సినిమాకి మొదటిరోజు వెళ్ళాలి అనిపించేలా చేస్తుంది .
పెయింటింగ్
సినిమా పేరుని అనేక కాలిగా వుండే ప్రదేశాలలో పెయింట్ తో రాయించడం వలన ఆ సినిమా పేరుని చూసిన
అందరు చదవటం వలన అది మనసులో ముద్ర పడిపోతుంది . అలా ఆ సినిమా పేరునే మరలా మరలా చదవటం వలన ఏ కొద్ది
మందో సినిమా ధియేటర్ వెళ్ళే అవకాశం వుంది .
విమానంకి పెయింటింగ్
విమానకి సినిమా
పేరుతో పాటు నటుల బొమ్మలని వేసి కూడా ఆ సినిమా ప్రచారాన్ని ఒక దేశం నుంచి
మరొక దేశంకి ఆ సినిమాని తెలిసేలా చేస్తారు . విమానాల ద్వారా చేయించే ప్రచారం అనేది
చాలా అరుదుగా జరుగుతుంది . ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుంది , ధియేటర్
రప్పించేల చేస్తుంది .
first look
first look అనేది ఒక పోస్టర్ రూపంలో రిలీజ్
చేస్తారు . ఇది trailer కి ముందుగా రిలీజ్ చేస్తారు . ఒక క్యారక్టర్ని , కధని పలానా విధంగా వుంటుంది అని తెలియచేస్తూ ఈ first look పోస్టర్ని రిలీజ్ చేస్తారు .
trailer
already
సినిమా తీయడము మొదలు పెట్టినా నుంచి
ప్రేక్షకులు trailer కోసం ఎదురుచూస్తూ వుంటారు . trailer అనేది ఒక్క సారిగా
సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వగానే ఆ trailer చూసి సినిమా పలానా విధంగా వుంటుంది అని
చర్చించుకోవడం సహజంగా జరుగుతూ వుంటుంది . ఈ trailer ని all సోషల్ మీడియాలోనూ , tv
channel లోనూ, తియేటర్లోనూ ప్రదర్శిస్తారు. trailer అనేది ప్రేక్షకులు సినిమా నుంచి మరీ చాలా
ఎక్కువగా ఆశించేలా ఉండకూడదు అని నా అభిప్రాయం . ఎందుకంటే ఆశించిన దానికన్నా తక్కువ
వుంటే ప్రేక్షకులు నిరుస్తాహపడతారు . అలా నిరుస్తాహపడితే సినిమా చూసి భయటకి వచ్చిన
వెంటనే మనం ఆశించినంత గొప్పగా ఏం లేదు అనే చెడ్డ ప్రచారణ వచ్చే ప్రమాదం వుంది .
బస్సు
టికెట్
ప్రస్తుత కాలంలో బస్సు టికెట్ పై తమ సినిమా
ప్రచారాన్ని కొత్తధనంతో చేస్తున్నారు .
ఇలా చేయడం వలన బస్సులలో ప్రయాణించే ప్రతి ఒక్కరికి సినిమా గురించి తెలిసేలా చేస్తుంది
, ఇలా చేయడం వలన ప్రత్యెక ఆకర్షణ గా నిలుస్తుంది . ఈ ఆకర్షణే ప్రేక్షకులను ధియేటర్
రప్పించేలా చేస్తుంది .
All Social Media
ప్రస్తుత కాలంలో
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో
కాలి సమయంలో ప్రేక్షకులు సోషల్
మీడియాకే మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నారు
.అతి తక్కువ కర్చుతో , అతి తక్కువ సమయంలో
ప్రపంచం అంతా తమ సినిమా గురించి తెలిసేలా సోషల్ మీడియాలో ప్రచారం
చేస్తున్నారు . అన్ని రకాల ప్రచారలలోకేల్ల ఎక్కువగా తెలిసేలా చేసేదే ఈ సోషల్
మీడియా .
websites
తరచూ మనం కొన్ని websites వాడుతూ వుంటాం . కొన్ని
ట్రావెల్ బుకింగ్ కోసం వాడుతుంటాం , మనికొన్ని సైట్స్ ని కొత్త విషయాలు
తెలుసుకోవడం కోసం , ఇంకొన్ని news పేపర్ని
చదవడం కోసం కూడా చూస్తుంటాం . అయితే ఆ
websitesలో కూడా సినిమా గురించి పుబ్లిసిటీ చేయడం ద్వారా ప్రేక్షకులకి పలానా
సినిమా అని తెలుస్తుంది .
games
ప్రస్తుత కాలంలో అదిక శాతం స్మార్ట్ ఫోన్స్ వాడుతుండటం వలన సినిమాకి
సంభందించిన gamesని కూడా ఉపయోగిస్తున్నారు
. ఈ games అనేవి సినిమా పేరుని అందరికి
తెలిసేలా చేయడానికి
ఉపయోగిస్తున్నారు .
స్టిక్కర్స్ మరియు కీ చైన్లు
పిల్లలు ఆడుకొనే స్టిక్కర్స్ మరియు చిన్న చిన్న
బొమ్మలు లేక కి చైన్లు సినిమా ప్రచారానికి వాడుకున్నట్లు అయితే ఆ
ప్రచారం అనేది పిల్లలు వున్నా కుటుంబాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది . ఆ
ప్రభావమే సినిమా ధియేటర్ రప్పించేలా చేస్తుంది .
టి షర్ట్స్
సినిమా ప్రచారం లో భాగంగా సినిమా హీరోలు లేదా
సినిమా టైటిల్ తో ప్రింట్ చేయబడిన టి షర్ట్స్ ని
అమ్మకానికి మార్కెట్లోకి వదలడం వలన ఆ సినిమాకి ప్రత్యేకంగా ప్రచారం
చేయనవసరం లేని సందర్భం ఏర్పడుతుంది మరియు
ఈ ప్రచారం ప్రజల అందరిలో ప్రభావితం చేయబడుతుంది . ఈ ప్రభావమే ప్రేక్షకులని సినిమా
ధియేటర్కి రప్పించేలా చేస్తుంది .
టైటిల్
సినిమాకి సంభందించి ప్రేక్షకులను ప్రభావితం చేసే
విషయాలలో టైటిల్ కూడా ఒకటి . టైటిల్లో కొత్తదనం మరియు భిన్నత్వం లాంటివి
ఆకర్షనీయంగా నిలుస్తాయి . అయితే టైటిల్ని అనుసరించి స్టొరీ , పాటలు , డైలాగులు
వున్నట్లు అయితే ఆ సినిమా ప్రేక్షకులని మరింతగా ఆకర్షిస్తుంది . ఆ టైటిల్ని పదే
పదే విన్నపుడు ఆ సినిమాని చూడాలనిపిస్తుంది .టైటిల్ని చూసే చాలా మంది సినిమాకి
వెళ్తుంటారు .
నూతన నటి నటుల ఎంపిక
నూతన నటి నటుల ఎంపిక అనేది విసృతంగా చేయడం వలన
తీయబోయే సినిమా గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయనవసరం లేని సందర్భం ఈ నూతన నటి
నటుల ఎంపిక విధానం . ఇలా చేయడం వలన తీయబోయే సినిమా గురించి సినిమా ప్రేక్షకులకి
ఎక్కువ శాతం ప్రచారం చేయబడినట్లు అవుతుంది . ఆ ప్రచారంలో అనేక ఆకర్షణా విషయాలు
వున్నట్లు అయితే ఆ ఆకర్షణ విషయాలే ప్రేక్షకుడిని సినిమా ధియేటర్ రప్పించేలా
చేస్తాయి .
దర్శకులు మరియు నటి నటులు
కొందరు దర్శకులకి , నటులకి వీరాభిమానులు వుంటారు
. వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ప్రేక్షకులు first రోజే వెళ్ళడానికి
సిద్దమవుతారు . అలా కాకుండా వరుసగా విజయం సాదిస్తున్న దర్శకులు కాని , నటులు కాని
వారి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు .
mouth publicity
అన్నిటికన్న భలమైనది ఈ నోటి ద్వార చేసే
పుబ్లిసిటీ . ధియేటర్లో ప్రేక్షకుడు సినిమా చూసి భయటకి వచ్హాక సినిమా చాల భాగుంది
అని చెప్పే మాట ఇతర ప్రేక్షకులని ధియేటర్
రప్పించేలా చేస్తుంది . ఆ సినిమాకి
సంభందించిన ప్రత్యేకతలు చెప్పడం ద్వారా
ప్రేక్షకులు మరింత ఆకర్షితులు అవుతారు . సినిమా చూడటానికి మరింత తొందర పడతారు . అలా కాకుండా పొరపాటున కాని , నచ్చకపోవడం వలన కాని , లేదా కావాలనే ఆ సినిమా భాలేదు అని ఒక్క మాట చెపితే చాలు ఆ సినిమా
చూడటానికి , మాట్లాడుకోవటానికి పెద్దగా ఆశక్తి చూపరు . కాభట్టి సినిమాని అద్బుతంగా చూపే విధంగా జాగ్రత్త
తీసుకోవాలి .
No comments:
Post a Comment