సినిమా విజయం
అనేధీ ప్రధానంగా ఎన్నిక విధానం మీద , తరువాత కష్టపడి పనిచేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది
. ఎన్నిక విషయానికి వస్తే
ఒక నిర్మాత అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించేలా కధని ఎన్నుకొని కధని డైరెక్ట్ చేయగల
శక్తి ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం వలన నిర్మాత సినిమా తీయడంలో సగ భాగం విజయం సాదించినట్లే
. అంటే ఎన్నిక విషయంలో అంత జాగ్రత వహించాలి అని నా ఉద్దేశం .
అలాగే డైరెక్టర్ ఊహించుకున్న కధకి తగినటువంటి నటి నటులను , టెక్నీషన్స్
ని ఎన్నుకోని కష్టపడటంలో దర్శకుని విజయం ధాగుంది .
అలాగే ఒక
హీరో పెద్ద స్టార్ అవడానికి కధ ,సాంగ్స్ , డ్యాన్స్ , ఫైట్స్ , ఎమోషన్స్ మొధలగు విషయాలలో రాజీ పడకూడదు
.
ఇలా ఈ ఎన్నిక
విధానం అనేధీ విజయం సాదించటానికి అతి ప్రధానమైన విషయం .
అయితే
సహజంగా ఒక కొత్త సినిమాకి ప్రత్యేకమైన కొత్త విష్యాలు ఉంటే ఆ సినిమా పట్ల ఆకర్షితులు
అవుతారు .
అయితే కొత్తధనం
మాత్రమే ఉంటే సినిమాకి విజయం వస్తుంది అన్న నమ్మకం లేదు . ఆ కొత్తధనంలో స్పష్టత ఉండాలి . ఇక
సినిమాలోకి వెలితే కధలో భలమైన ఎమోషన్స్ ఉండాలి , నటనలో రియాలిటీ
ఉండాలి .కొన్ని ప్రత్యేక ఆకర్షనా విషయాలు , పాటలు , డ్యాన్స్ , ఫైట్స్
, మొదలైన విషయాలు మరియు ధర్శకుని
ప్రతిభ చూపినపుడే ఆ సినిమా విజయం సాధిస్తుంది .
అయితే ఎంధుకు
ఈ కొత్తదనం అంటే ఎవరికైన ఒక కొత్త విషయాన్ని
చెప్పినపుడు శ్రద్దతో ఆసక్తితో వింటారు . అధె విధంగా సినిమా కొత్త
విషయాన్ని చూపించేటపుడు శ్రద్దగా చూస్తారు
. ఉధాహరణకి మనం చూసే ప్రేమ కధలు అన్ని ఒకేలా ఉంటాయి ,కానీ ఆ కధలో పాత్రాబినయం మాత్రం ప్రత్యేకతను చాటుతాయి , అందువలనే ఆ సినిమా కొత్తగా కనిపిస్తుంది. టెక్నాలజీ , సౌండ్ , నటుల ప్రవర్తనా విధానం కొత్తగా చూపించడం వలన
ఆ సినిమా కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది .
అయితే సినిమా
రిలీజ్ ముందు ఎంత పబ్లిసిటీ చేసినా ఆ సినిమా ప్రేక్షకులు ఆశించినధానికన్నా ప్రేక్షకులకి
అనేకరెట్లు ఆనంధాన్నిఇచ్చినపుడే సినిమా విజయం సాద్యమవుతుంది .
No comments:
Post a Comment