నా ఉద్దేశంలో కధ అంటే కర్మ చేసిన
చేస్తున్న చేయబోయేటటువంటి మనుషులు కాని జంతువులు కాని మరేమైనా కావచ్చు , వాటి
కర్మ (చేసే పనులు ) కర్మ పలాల (చేసిన పని వలన వచ్చిన పలితాలు) గురించి తెలియచేయడమే
కధ .కాని ఆ కర్మలను గురించి చెప్పటానికి కధలో ఒక ప్రారంభం , విస్తరణ , ముగింపు అనే
విధంగా విభజించుకొని కధకి ఒక రూపాన్ని ఇస్తున్నాము .ఈ కధలు ఇతరులు చెపుతుంటే లేదా పుస్తకాలు , నవలలు చదువుతుంటే ఊహత్మకమైనవి
.లేదా తోలుబొమ్మలాట నాటకాలు లేదా సినిమాల
ద్వారా అయితే దృశ్య రూపమైనవి .
కధ అనేది ఒక అంశానికి లేదా పలు
విషయాలకి సంభందించినది . ఆ విషయానికి ఒక పుట్టుక ఒక ప్రయాణం కొన్ని సమస్యలు కొన్ని
పరిష్కారాలు ఒక లక్ష్యం ఒక ప్రయత్నం ఒక విజయం మొదలగు ఎన్నో అంశాలు ఆ విషయంలో ఉంటాయి
. ఉదాహరణకి ప్రేమ అనే విషయంలో ఇద్దరి charactors మధ్య ప్రేమ పుట్టింది . ఆ కధ సంతోషంతో కొద్ది రోజులు
భాగానే ప్రయాణం చేసింది . అనుకోకుండా ఆ ప్రేమ కధ పెద్దల దగ్గరకి పోవడం వలన కొన్ని
సమస్యలు ఎదుర్కొని పరిష్కారాన్ని వెతకంగా ఒక లక్ష్యం కనిపించింది ఆ లక్ష్యం సాదించడం
కోసం ఆ ప్రేమ కధ కొన్ని ప్రయత్నాలు చేసింది . ఆ ప్రేమకధ ప్రయత్నం పలించి విజయం
సాదించింది .అయితే ఆ కధ ప్రాణం ఉన్న జీవం లాంటిది .ఇది మంచి ప్రేమకధ అయితే ప్రేక్షకునితో కనెక్ట్ అయినట్లు అయితే తరువాత
కధ ప్రేక్షకునితో సీరెస్ అవ్వచ్చూ లేదా సిల్లీగా మారిపోవచ్చూ . ఈ కధే
ప్రేక్షకునికి ప్రేమని ఇవ్వచ్చు , ఆనందాన్ని
ఇవ్వచ్చు , భాదని ఇవ్వచ్చు , భయాన్ని ఇవ్వచ్చు , మరేమైనా ఎమోషన్ని ఇవ్వచ్చో ఇంకా
తనలో దాచుకున్న చాల చాల ఇవ్వచ్చు . లేదా సినిమాలోని ప్రేమకధ అర్ధ
రహితమైతే ప్రేక్షకునికి ఏమి అర్థం
కాక ఆ ప్రేమకధ ప్రేక్షకునికి పిచ్చెక్కేలా పిచ్చిని ఇవ్వచ్చు
, భాదని ఇవ్వచ్చు . నచ్చకపోతే కధ ఏమి భాగలేదు
అన్న భావన ఇవ్వచ్చు . కాభట్టి మంచి కధని భలమైన కధని ఎన్నుకోవాలి .
No comments:
Post a Comment