మనిషి కోరికల వలనో, ఆశల వలనో లేదా అనుకోని సంగటనల
వలనో కర్మలు జరుగుతాయి . ఆ కర్మలే (చేయడం లేదా పనులు ) కధలు అవుతాయి. ఏం కోరికలు
ఏం కర్మలు ఏం పలితాలు అని కదా రచయిత ప్రేక్షకులకి నచ్చేవిధంగా మార్పులు చేసుకొని
కధగా రచించాలి . వాస్తవానికి కధలు రెండు
రకములుగా పుడతాయి . ఒకటి వాస్తవాలనుంచి పుట్టే
కధలు రెండు అవాస్తవాలనుంచి పుట్టే
కధలు .
వాస్తవాలనుంచి పుట్టే కధలు
ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంభానికి
ప్రతి ఊరికీ ప్రతి దేశానికి ఇలా చాల అంశాలకి చాల విషయాలకి సంభందించిన కధలు ఎన్నో
వుంటాయి . అవి చరిత్ర నుంచి కావచ్చు లేదా జరుగుతున్నటువంటి వాటి నుంచి అయినా కావచ్చు
. ఆ కధలే మన సినిమా కధలుగా కొన్ని సక్సెస్ సూత్రాలతో రచించవచ్చు . అంటే ప్రేక్షకునికి నచ్చేవిధంగా తగు మార్పులు చేసి
మరియు అన్ని వర్గాల్ని ఆకర్షించే అంశాలని
చేర్చాలి .ఇలా చేర్చిన కదనే సినిమా తీయాలి .ప్రస్తుత సమాజంలో జరిగే విషయాలని
తెలివిజిన్ ద్వారనూ, న్యూస్ పేపర్ ద్వారనూ
ఎన్నో చూస్తూ వుంటాం . ఆ చూసే సంగటనలను అంశాలను విషయాలను తీసుకొని ప్రేక్షకునికి
నచ్చేలా కధని రచించవచ్చు .
కల్పిత కధలు
ఒక అంశమును ఎన్నుకొని ఆ అంశానికి సంభందించిన అన్ని విషయాలను శేకరించి
నీ ఊహలో ఎవరు ఏది ఎందుకు చేస్తున్నారు అనేది అధ్బుతంగా రచించడమే
కల్పిత కధగా చెప్పచు . కధ అవసరాన్ని బట్టి వున్నవి లేనట్టుగానూ,లేనివి
వున్నట్లుగాను జరిగినవి జరగనట్లు గాను , జరగనివి జరిగినట్లు గాను ఒక పద్దతి ప్రకారం
సన్నివేశాలను కధకి అనుగుణంగా రచించాలి .
No comments:
Post a Comment