Friday, September 7, 2018

ధర్శకుడు


                                                   
ఒక సినిమా ప్రారంబం నుంచి ఆ సినిమా కోసం పనిచేసే అందరిని తన ఆలోచనా విధానంతో పనిచేయిస్తూ ఆ  సినిమా output వచెంతవరకు  మరియు ఆ సినిమా విజయం సాధించేంత వరకు భాధ్యతలు అన్ని తన మీద వేసుకొని శ్రమించే వ్యక్తే నిజమైన దర్శకుడు . సహజంగా దర్శకునికి ఒక సీన్ ఎలా రాస్తారో తెలిసుండాలి . ఆ రాయబడిన సీన్ ఎలా మేకింగ్ చేస్తారో తెలుసుండాలి , మేకింగ్ చేయబడిన సన్నివేశాలను ఎలా ఎడిట్  చేస్తారో తెలుసుండాలి . ఒక సినిమా విజయానికి సహకరించే అన్ని విషయాలయందు దర్శకుడు importance ఇవ్వాలి .
                                        దర్శకునికి తను చేసే పని మీద తనకి స్పష్టత వుండాలి మరియు తను ఏం చేస్తున్నాడో , ఎందుకు చేస్తున్నాడో , ఎలా చేస్తున్నాడో అనే విషయాల మీద  స్పష్టత వుండాలి . ఒక విజయాన్ని సాధించాలి అంటే ఏమి చేయాలో ఎలా  చేయాలో అనే విషయాల మీద స్పష్టత వుండాలి . అలాగే ఎదుటి వారు రున్నింగ్ ప్రొడక్షన్ కోసం  ఏమి చేయాలో ఎదుటి వారికి అర్దమైయేలా స్పష్టత కలిగించేలా దర్శకుడు వివరించాలి .
                                  కధ పూర్తి  అయిన తరువాత ఆ దర్శకుడు ఆ  కధని భాగా ఎమోషనల్ గా ఊహించుకోగలగాలి . ఆ కధలోని పాత్రలతో పాటు లొకేషన్ని , ధ్వనిని కూడా ఎమోషనల్ గా ఊహించుకోవాలి .ఇలా ఊహించిన తరువాత తన ఊహలో ఉన్నటువంటి పాత్రలకి ఎటువంటి నటులు అయితే సరిపోతారో  చూసుకొని ఎంపిక చేసుకోవాలి . నటుల ఎంపిక పూర్తి అయిన తరువాత సినిమా షూటింగ్ అనుకూలమైన లొకేషన్ని ఎన్నుకోవాలి .  లొకేషన్ ఎన్నిక అయిపోయాక రున్నింగ్ ప్రొడక్షన్  జరగటానికి అవసరమైన లైటింగ్ , కేమేరాస్ , మేకప్ , వస్త్రాలు , సంగీతం , ఎడిటింగ్ లాబ్ మొదలగునవి అన్ని సెలెక్ట్ చేసుకోవాలి .పాట లో కూడా కధే వుంటే ఆ పాటని కూడా కధ తీసే సమయంలోనే చిత్రికరించేలా వుంటే ఆ పాటలని ముందుగానే రికార్డింగ్ చేసుకొని వుంచుకోవాలి . సినిమాకి సంభందించి అన్ని వర్గాలతో అగ్రిమెంట్లు పూర్తి అయినతరువాతవ షూటింగ్ రున్నింగ్  ప్రొడక్షన్ని ఏ సమయానికి ఎలా తీయాలో పక్కగా ప్రణాళిక వేసుకొని ప్రారంభించాలి . ఈ ప్ర్రరంభించే ముందు సినిమాని పలు రకాలుగా డివిజన్ చేయాలి .లొకేషన్ డివిజన్ అని , సీన్ డివిజన్ అని , షాట్ డివిజన్ అని చేయాలి . ఈ డివిజన్ అనేది ఎందుకు చేస్తారు అంటే రున్నింగ్ ప్రొడక్షన్ మీద స్పష్టత రావడం కోసం మరియు ఏ  లొకేషన్లో ఏ సీన్లు తీయాలి , లొకేషన్ లో ఏ నటులు అవసరమో , ఆ సీన్ ఎలా తీస్తే అందంగా చూపించగలమో  అనేదానికోసం ఈ డివిజన్ చేస్తారు .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...