Friday, September 7, 2018

లొకేషన్ ఎన్నికా విధానంలో జాగ్రత్తలు



లొకేషన్ ఎన్నికా విధానం అనేది చాల జాగ్రత్తగా తీసుకోవలసిన విషయము ఎందుకంటె వెండి తెరపై లొకేషన్ని అందంగా ఆకర్షణీయంగా లేదా కధకి తగిన విధంగా లొకేషన్ని చూపించటానికి షూటింగ్ జరిగే సమయంలో చాల సమస్యలు రిస్క్స్ వుంటాయి .
ఒక లొకేషన్ లో సినిమా షూటింగ్ జరగాలి అంటే ఆ లొకేషన్కి సంభందించిన అదికారులనుంచి అనుమతి తీసుకొని వుండాలి .
షూటింగ్ చేసే సమయంలో షూటింగ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల సంఖ్య పెరిగి షూటింగ్ కి ఇబ్బంది కలిగేలా వుంటే సెక్యూరిటీని పెట్టుకొని షూటింగ్ చేయాల్సి వుంటుంది .
షూటింగ్ చేసే సమయంలో ఆ లొకేషన్లో పవర్ ఉందా లేదా అని ముందుగానే చూసుకోవాలి .
ఆ లొకేషన్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఉండటానికి వసదులు ఉన్నాయా లేదా అని గమనించుకొని లొకేషన్ని ఎన్నుకోవాలి .
మరి చల్లగా వున్నా ప్రదేశాలు కాని లేదా మరి వేడిగా వున్నా లొకేషన్ అయితే ఆరోగ్యరిత్య తగు జాగ్రత్తలు వహించాలి .
మనం షూటింగ్ చేసే లొకేషన్లో మన ఆరోగ్యానికి మరియు మన అలవాటులకి సరిపడే ఆహారం ముందుగా దొరుకుతుందా లేదా అని జాగ్రత్త వహించాలి .
షూటింగ్ లొకేషన్లో అనుకోకుండా నటులు కాని మరెవరైనా ఏదైనా అనారోగ్యానికి గురయితే దానికి సంభందించిన మందులని ముందుగానే దగ్గర వుంచుకొని జాగ్రత్త వహించాలి .
ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్న లొకేషన్ కి  అనుకున్న సమయానికి ట్రావెలింగ్ ద్వారా లొకేషన్ కి వెళ్ళడానికి సరైన దారి సదుపాయం ఉందా లేదా అని సరిచూసుకోవాలి .
వేరే షూటింగ్ లొకేషన్ కి వెళ్ళినపుడు జంతువుల నుంచి కాని మనుషుల నుంచి కాని లేదా మరే ఇతర విషయాలనుంచి కాని ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్త వహించాలి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...