Friday, September 7, 2018

కధలోని మూడు దశలు



ఒక కధని మూడు దశలుగా విభజించుకోవాలి .అవి కధ ప్రారంభ దశ , కధ విస్తరణ దశ , కధ ముగింపు  దశగా విభజించుకోవాలి .
ప్రారంభ ధశ
కధ ప్రారంభ దశ అనేది చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయము . ఎందుకంటె ప్రేక్షకుడు అన్ని విషయాలు మరచి వెండి తేర ముందర కుర్చున్నతరువాత ప్రేక్షకునితో సినిమా కధ కనెక్ట్ అయ్యేది ఈ ప్రారంభ దశలోనే . అలా కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రారంభ దశలోనే ప్రేక్షకుడిని ప్రభావితం అయ్యేలా ఆసక్తి విషయాలు ఇంట్రడక్షన్లు మొదలగు కొత్త విషయాలు ప్రారంభ  దశలోనే చూపించాలి .
ఈ ప్రారంభ దశను పరిచయ దశ అని కూడా అనవచ్చు. ఎందుకంటే కధలో చాలావరకు అన్ని పరిచయాలు ప్రారంభ దశలోనే ఉంటాయి .అవి నటుల పాత్రలు కావచ్చు ,లేదా లక్ష్యాలు కావచ్చు , లేదా సమస్యలు కావచ్చు , లేదా లొకేషన్ కావచ్చు . విస్తరణ దశ నడిపించడానికి ప్రేక్షకునికి అర్థమటానికి కధలో ముందుగా చేసే ప్రయత్నమే ప్రారంభ దశ . ప్రారంభ దశ అనేది చాల గొప్పగా చూపిస్తే నెక్స్ట్ కధ విస్తరణ దశలో ఏదో గొప్పగా వుంటుంది అనేలా ప్రేక్షకుడు  ఆశిస్తాడు . ఆ ఆశించిన విధంగా విస్తరణ దశలో కధ గొప్పగా లేకపోతే ప్రేక్షకులు నిరాశ పడే అవకాశం వుంది .కాబట్టి ప్రారంభ దశలో కదా సన్నివేశాలు  ఎలా వుండాలి ,  కదా విస్తరణ దశలో కదా సన్నివేశాలు ఏలా వుండాలి ,  ముగింపు దశలో కదా సన్నివేశాలు ఏలా వుండాలి అని కధ రచయతకి  స్పష్టంగా తెలిసుండాలి . ప్రారంబదశకి విస్తరణ దశకి తగినట్లుగా వుండాలి . విస్తరణ దశ ముగింపు దశకి తగినట్లుగా వుండాలి .
                                             ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లు అయితే ఇద్దరి ప్రేమికుల మద్య  ప్రేమ చిగురించి ఆట పాటలతో గడుపుతూ వుండటం ప్రారంభ దశ .
వారి ప్రేమ ఇంట్లో తెలిసి వాళ్ళ నన్నే విలన్ అయితే ఆ ప్రేమికులకు వచ్చే సమస్యలు వారు పడే కష్టాలు మరో ఇతర పరిస్థితులే విస్తరణ దశ .
చివరికి వారి ప్రేమ ఎలా విజయం సాధిస్తుంది అనేదే ముగింపు దశ .
ఇలా ఏ దశలో ఏ సన్నివేశాలు వుంటే పక్క ధశకి  భలం అందం ఆకర్షణ వస్తుందో రచయత విచారణ చేసి కధ రాయడం ఉత్తమము అని నా ఉద్దేశము .
విస్తరణ ధశ
ప్రారంబ దశలో ఇంట్రడక్షన్ ఇంత గొప్పగా వుంటే ఇక స్టొరీలోకి వెళితే ఎంత గొప్పగా వుంటుందో అని ప్రేక్షకులు ఆశక్తిగా చూస్తారు . ప్రారంభ దశ తరువాత విస్తరణ దశ మొదలవుతుంది . ప్రారంభ దశలో వున్నా కధా భలానికి విస్తరణలో దశలో కదాబలం ఏ మాత్రం తగ్గకూడదు .ఏ మాత్రం తగ్గినా కధని చూసే ప్రేక్షకులు నిరుస్తాహ పడే అవకాశం వుంది .విస్తరణ దశపై  రచయతకి ఒక మంచి అవగాహన వుండాలి . విస్తరణ దశలో ఎటువంటి సీన్లు వుండాలి , ఎటువంటి మలుపులు వుండాలి , కధ ఎక్కడనుంచి ఎక్కడికి వెళుతుంది అనే విషయం మీద ఒక స్పష్టత వుండాలి.కధలో ఊహించని సన్నివేశాలు , మలుపులు ప్రభావితం చేసే అన్ని విషయాలు  చివరికి ముగింపు దశలో పరిస్కరించబడతాయి .
ముగింపు ధశ
ముగింపు దశలో కధ ఎలా వుండాలి అంటే ప్రేక్షకుడు కనురెప్ప ఆర్చకుండా tenction  తో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఎక్కువ శ్రద్దతో చూసేలా వుండాలి . ఉదాహరణకి  ముందు నుంచి ప్రేమించుకుంటున్న ప్రేమికులు కలుస్తారా లేదా అని , లేదా  విజయం సాదిస్తారా లేదా అని మరేదైనా కాని జరుగుతుందా లేదా అనే విషయాలు ముగింపు దశ లో వుండాలి .ఇలా ముగింపు దశలో భలంగా ప్రభావితం చేసి , భలంగా హృదయానికి హద్దుకుపోయేలా చేసి, కన్నీరు పెట్టించేలా కాని ,లేదా tenction కలిగించేలా కాని , లేదా ఏదో ఒక భలమైన ఎమోషన్కి గురిచేసి చివరికి ప్రేక్షకుడు satisfaction చెందేలా వుండాలి .  కొన్ని సార్లు ముగింపు ధశలో కళ్ళలో నీళ్ళు తెప్పించే సీన్లు పెట్టినా కూడా ఆ సీన్లు ప్రేక్షకునిని ప్రభావితం చేయవు . ఎందుకంటే విస్తరణ దశలో బలం లేకపోతే ముగింపు దశలో సీన్లకి పొంతన ఉండదు . అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే  ఒక దశలో సీన్లకి మరొక దశలో సీన్లకి పొంతన వుండాలి . 
                                       ఇలా కధలో ప్రారంభ దశ విస్తరణ దశ ముగింపు దశలు అనేవి ఒక ఒకదానిమీద ఒకటి ఆధారపడి  కధకి బలాన్ని చేకూర్చాలి . ప్రేక్షకుడు సినిమాతో కనెక్ట్ అవ్వడానికి ప్రారంభ దశ అనేది భలంగా వుండాలి . ఈ ప్రారంభ దశ కన్నా అనేకరెట్లు విశరణ దశ భలంగా వుండాలి . చివరిగా ముగింపు దశలో కధ అవసరాన్ని బట్టి ప్రేక్షకుడు ఏదో ఒక భలమైన  ఎమోషన్స్ కి ప్రభావితం అయ్యేలా జాగ్రత్త వహించాలి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...