Friday, September 7, 2018

కధ ఎలా వుండాలి ?



కధ ఇలావుండాలి అలా వుండాలి అన్న నియమాలు లేవు కాని కధ ఎలా వున్నా కూడా ప్రేక్షకునికి నచ్చేలా, ప్రేక్షకుడిని ఆకర్షించేలా మరియు అర్ధమయ్యేలా , ప్రేక్షకుడిని ప్రభావితం చేసేలా , ప్రేక్షకుడిని ఆనందింప చేసేలా వుండాలి .కాని మొట్ట మొదటగా కధలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది దేనికోసం జరుగుతుంది అనే విషయాలు ప్రేక్షకునికి అర్థమైయేలా వుండాలి .సినిమా చూస్తున్నపుడు కధ ఎందుకు జరుగుతుందో అర్థం కాకపోతే సినిమాకి ప్రేక్షకునికి మధ్య connectivity లేనట్లే .

కాబట్టి కధ అంతా దేనికోసం జరుగుతుందో అన్న కారణం ప్రేక్షకునికి తెలిసేలా ఉండాలి .కాని నెక్స్ట్ కధ ఏం జరగబోతుందో ఊహించేలా ఉండకూడదు .కధ జరుగుతుంటే కనురెప్ప ఆరిస్తే ఏం జరిగిపోతుంటుందో అనేలా కధ వుండాలి .ప్రతి మాటలోనూ పాటలోనూ ఎమోషన్ లోనూ కధే వుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం .సినిమా చూసి బయటకి వచ్చిన తరువాత ఆ సినిమాకి సంభందిన కధ గురించి మాట్లడుకోనేలా కొన్ని ప్రత్యేకతలు వింతలు విశేషాలు  ప్రభావితం చేసే సీన్లు  వుండాలి . సినిమా చూసిన ప్రేక్షకులు కధలోలాగా నేను కూడా చేస్తే బాగుంటు అనిపించేలా వుండాలి .కధలు అనేవి ఒక వర్గం మాత్రమె కాకుండా అన్ని వర్గాలకి నచ్చేలా వుండాలి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...