Friday, September 7, 2018

చిన్నబడ్జెట్ సినిమాలు




     

ఒక చిన్న సినిమా బడ్జెట్ నిర్మాత కాని పెద్ద బడ్జెట్ సినిమా నిర్మాత కాని తన ప్రతి సినిమాని తొలి సినిమాలా భావించి కధ మరియు  ధర్శకునిని ఎన్నుకొనే విధానంలోనే నిర్మాత విజయం వైపు మొదటి అడుగు వేసినట్లు అవుతుంది . అన్నిటికన్నా  నిర్మాతకి కావలసింది నమ్మకం . ఆ నమ్మకం ఎలా వస్తుంది అంటే ఏమి చేస్తే  సినిమాని చక్కగా తీయగలమో ఏమి చేస్తే సినిమాని విజయవంతం వైపు నడిపించగలమో నిర్మాతకి తెలిసుండాలి . ఆ తెలిసినపుడే నమ్మకం ఏర్పడుతుంది .తక్కువ కర్చుతో సినిమా తీయడానికి కధ మరియు దర్శకుడిని ఎన్నిక విధానం మీదే ఆధారపడి వుంటుంది .
ఎన్నిక విధానం
అతి తక్కువ కర్చుతో సినిమా తీయాలి అనుకొనేవారు నటులని మరియు సినిమాకి పనిచేసే వారిని ఏన్నుకోవడంలో తగు జాగ్రత్తలు పాటించి కొత్తగా అవకాశం కోసం ఎదురుచూసే టాలెంట్ కలిగిన వారిని ఎన్నుకోవడం వలన అతి తక్కువ కర్చుతో  సినిమా తీయడం జరుగుతుంది .
కధే ప్రధానమైనది
తక్కువ కర్చుతో తీసే సినిమాలకి కధే అతి ప్రదానమైనది . సినిమా విజయం కావడానికి సినిమా పూర్తిగా కధమీదే ఆధారపడి వుంటుంది . ఎందుకంటె నిర్మాత ఎక్కువ కర్చు పెట్టి సీనియర్ actorsని ఎన్నుకోవడం జరగదు అది కాకా తక్కువ కర్చుతో చేసే సినిమాలకి పెద్ద హంగులు ఆర్భాటాలు వుండవు . కాబట్టి కధ అనేది అద్బుతంగా ఉండేలా నిర్మాత జాగ్రత్త తీసుకోవాలి . అల కధలో భలం లేకపోతే ఆ సినిమాని తీయపోవడమే ఉత్తమం .కాబట్టి కధ ఎన్నిక విధానంలో తక్కువ లొకేషన్స్ మరియు తక్కువ నటులు వుండాలి కాని అద్బుతమైన కధ ఉండేలా జాగ్రత్త వహించాలి .
తక్కువ లొకేషన్స్ మరియు free లొకేషన్స్
ఎక్కువ లొకేషన్స్ వుంటే నిర్మాతకి ఎక్కువ కర్చు పెరుగుతుంది .ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్ కి మారినపుడు సమయం ఎక్కువ అవుతుంది మరియు ట్రావెలింగ్ కర్చులూ ,అనుకోని కర్చులు  కూడా పెరుగుతాయి . పాటలకోసం లేదా ఇతర సన్నివేశాలు తీయడానికి free లొకేషన్స్ ని ఎన్నుకోవడం వలన నిర్మాతకి కర్చు తక్కువ అవుతుంది . కధలో ఏవన్నా పండగలు వుండే సన్నివేశాలు వుంటే కొన్ని గ్రామాలలో జరుగుతున్నటువంటి పండుగలు కాని , జాతరలు కాని , తిరునాళ్ళు కాని , ఆ గ్రామా పెద్దల అనుమతితో వాటిని  సినిమా షూటింగ్ కి వాడుకోవచ్చు .వేరే లొకేషన్స్ కి వేల్లలేనపుడు గ్రీన్ మరియు మొదలు అవసరమైన గుడ్డల ముందర షూటింగ్ చేసి అవసరమైన background లొకేషన్ ని పెట్టుకోవచ్చు .
తక్కువ మంది నటులతో
ఎక్కువ మంది నటులు అయితే ఎక్కువ ఖర్చులు అవుతాయి . కాని చిన్న బడ్జెట్ సినిమాలో తక్కువ మంది  నటులు వుండటం వలన తక్కువ కర్చు అవుతుంది మరియు వారి  పారితోషకాలు కూడా తక్కువ అవుతాయి . చిన్న బడ్జెట్ సినిమాలో ఎక్కువ  మంది నటులని పెడితే షూటింగ్ సమయంలో నటులు సినిమాకోసం పని చేసేవారికోసం  నివాసానికి అద్దెలు మిగతా కర్చులు ఎక్కువ అవుతాయి . అలా కాకుండా కొత్త నటులని ఎన్నుకోవడం వలన నటనపై మోజుతో ఉచితంగా చేయడానికి చాలామంది ఆశక్తి చూపుతారు .
free background music
తక్కువ కర్చుతో తీసే సినిమాలలో సంగీతం విషయంలో  పాటలవరకు సంగీతానికి కర్చు పెట్టడ్డం ఉత్తమం . ఇంకా background music విషయానికి వస్తే ఇంటర్నెట్లో దొరికే free గా వాడుకొనే background music ని  సినిమాకి వాడుకోవడం ఉత్తమం .
సినిమాకి సంభందించి తగు జాగ్రత్తలు
సినిమా స్టార్ట్  చేసే ముందర ప్రీ ప్రొడక్షన్ లో ఎటువంటి లోపము లేకుండా జాగ్రత్త వహించాలి . అంటే స్క్రిప్ట్  లొకేషన్ సినిమాకి సంభందించిన అన్ని విషయాలని ఎన్నుకోవడం మరియు షూటింగ్ జరిగే  సమయానికి లొకేషన్ అనుమతులు సెక్యూరిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి .
ఆర్టిస్ట్లను టైం కి రాకపోవడం , అనుమతి లేకుండా షూటింగ్ లొకేషన్ లోకి వెళ్ళడం , ట్రావెలింగ్ ప్రాబ్లం ,వరదలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు పవర్ ప్రాబ్లం , ఆక్సిడెంట్లు అనారోగ్యం సమ్మెలు మొదలగు సమస్యల వలన సినిమాకి షూటింగ్ కి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు వహించాలి .
                                         సమయానికి ధనాన్ని దగ్గర ఉంచుకోవడం సినిమాకి సంబంధించి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు మరియు అగ్రిమెంట్లు ఇన్సురేన్స్లు బుకింగ్లు మొదలగు విషయాలలో తగు జాగ్రత్తలు వహించాలి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...