తీయవలసిన సీన్ కోసం లొకేషన్లో ఎవరిచేత ఎలా
పనిచేయించుకోవాలో అనే విషయం మీద స్పష్టత మరియు సామర్ద్యం వుండాలి .షూటింగ్ దశలో
అనుకోని పరిస్థుతుల వలన దర్శకుడు చాల శ్రమని , సమస్యలను ఎదుర్కోవలసి వుంటుంది .
నటీ నటులు టైంకి రాకపోవడం కాని , లేదా అనుకున్నవి షూటింగ్ కి రెడీగా లేకపోవడం కాని
, మొదలగు అనేక విషయాలు సమయానికి కచ్చితంగా పనిచేస్తేనే షూటింగ్ జరుగుతుంది .
దర్శకుడు తను ఊహించుకున్న సీన్
తీయటానికి షూటింగ్ సమయంలో నటి నటులకి మరియు కెమెరా ,లైటింగ్ , మొదలగువారికి
అర్థమయేలా వివరించగలగాలి . ఏ సమయానికి ఎలా
చేయాలో ఏం చేయాలో అనే విషయాలను నటి నటులకు వివరించి , అవసరమైతే ఎలా చేయాలో
చూపించగలగాలి .
ఇలా దర్శకుడు నటులకి
సంభందించి మరియు సినిమాకి పనిచేసే అన్ని వర్గాల కి సంభందించి తగిన జాగ్రత్తలతో
సినిమా షూటింగ్ ని నడిపించాలి .
No comments:
Post a Comment