Friday, September 7, 2018

షాట్ డివిజిన్ చేయబడిన కధని సినిమాగా రూపొందించడానికి సహకరించే విషయాలు



సహజంగా దర్శకునికి ఒక సీన్ ని ఎలా రాస్తారో తెలిసుండాలి . ఆ రాయబడిన సీన్ ని ఎలా మేకింగ్ చేస్తారో తెలుసుండాలి , మేకింగ్ చేయబడిన షాట్స్ ని ఎలా ఎడిట్  చేస్తారో తెలుసుండాలి . కధని షాట్ డివిజిన్ చేసిన తరువాత ఒక సన్నివేశాన్ని ఎలా తీస్తే సినిమా లుక్ వస్తుందో , ఎలా ఎడిట్ చేస్తే సినిమాగా కనిపిస్తుందో  దర్శకునికి స్పష్టతగా తెలిసి ఉండాలి. ఈ షాట్ డివిజిన్ చేయబడిన కధ ని ఏం చేస్తే సినిమాగా మారుతుందో చూద్దాం .

Ø నటన ఒక కధని సినిమా రూపంగా మార్చడంలో నటనదే ప్రధాన పాత్ర . నటనలో  ఎమోషన్ తో కూడిన రియాలిటీ ఉండేలా జాగ్రత వహించాలి  దర్శకుడు .
Ø makeup అండ్ castumes  నటనలో రియాలిటీ వున్నా కూడా ఆ రియాలిటీని ఉన్నతంగా చూపించేదే makeup అండ్ custumes . ఈ రెండు సినిమా లుక్ తెప్పించడంలో సహకరిస్తాయి .

Ø లొకేషన్   అంటే స్టొరీ డిమాండ్  చేయనంత వరకూ లొకేషన్ అనేది సహజంగా అందరూ చూసేదిలా కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన లొకేషన్ ఉండేలా ఉంటే సినిమా లుక్ తెప్పించడంలో లొకేషన్ కూడా సహకరిస్తుంది .

Ø ఆంగిల్స్ అండ్ మూవింగ్స్    ఒకే షాట్ లో సీన్ మొత్తం తీస్తే అది చూడటానికి పెద్ద  ఆసక్తిగా ఉండదు. అయితే పలు పలు రకాల angles లో చూపించడం వలన అది సినిమా లుక్ గా మారుతుంది .
 
Ø lighting  నటన, makeup  అండ్ లొకేషన్ని  నార్మల్ గా కాకుండా ఉన్నతంగా స్పష్టంగా చూపించడానికి మరియు సినిమా లుక్ తెప్పించడానికి  లైటింగ్ అనేది సహకరిస్తుంది .
Ø DI(డిజిటల్ ఇంటర్మీడియట్ )  ఎడిటింగ్  చేయబడిన  సినిమా దృశ్యాలు మన కంటికి ఆకర్షనీయం గా కనిపించటానికి ఎక్కడ ఏ సీన్ కి  కలర్ తగ్గించాలో  లేదా  పెంచాలో మరియు  కలర్ కి సంభందించిన చేసే  మార్పులను డిజిటల్ ఇంటర్మీడియట్ అని అంటారు . ఈ DI  సినిమా దృశ్యానికి  ప్రాణం పోసినట్లు అవుతుంది మరియు సినిమా లుక్ తెప్పించడంలో ప్రదాన పాత్ర వహిస్తుంది .
Ø VFX (visual effects ) సినిమాలో అద్బుతాలు చూపించటానికి  మరియు వున్నవి లేనట్లుగా లేనివి వున్నట్లుగాను చూపించటానికి మరియు దర్శకుడు చేయటానికి వీలుపడని కొన్ని సన్నివేశాలకు ఈ VFX ని వాడతారు .  సినిమా లుక్ రియాలిటీగా  తెప్పించడంలో ఈ VFX ఉపయోగపడుతుంది.
Ø background music కనిపించే సినీమా దృశ్యానికి సౌండ్ తోడు అయితేనే  ప్రేక్షకునిలో ఎమోషన్ పుడుతుంది . సినిమా చూసే ప్రేక్షకుని ఎమోషన్ని రెచ్చగొట్టేది ఈ background music . కధని  సినిమాగా మార్చబడటానికి సహకరించే విషయాలలో  background music అనేది ప్రధాన విషయములో ఒక్కటి . 


No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...